జనం న్యూస్ 8డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్..
జైనూర్: జైనూర్ మండలం మార్లవాయి గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.91 లక్షల నిధులకు కృతజ్ఞతగా, మార్లవాయి గ్రామంలో సర్పంచ్ కనక ప్రతిభ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కల చిత్రపటాలకు గ్రామస్తులు పాలాభిషేకం చేశారు.మార్లవాయి గ్రామ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి రూ.91 లక్షల నిధులు మంజూరు చేయడం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన మార్లవాయి గ్రామానికి ఈ నిధులు అభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.ఈ నిధులతో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బెట్టి ఎలిజబెత్‌ల కాంస్య విగ్రహాల ప్రతిష్టాపనతో పాటు స్మృతి వనం ఏర్పాటు చేయనుండటంతో గ్రామానికి చారిత్రక ప్రాధాన్యత మరింత పెరుగుతుందని వారు అన్నారు.మార్లవాయి గ్రామ అభివృద్ధికి చొరవ చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మరియు డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్కలకు గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నావారు.. గ్రామపటేల్ ఆత్రం భగవంత్ రావ్,ఉపసర్పంచ్ ఆత్రం రాజేశ్వర్,వార్డ్ సభ్యులు సోయం రాజు,గేడం పార్వతి గణపత్, సీత,భరత్.రాము, మరు శ్రీకాంత్, సోనేరావ్,ఆత్రం నామ్ బాయి, కనక రూపా బాయి, తదితరులు గ్రామస్థులు, యూత్ సభ్యులు,మహిళలు పాల్గొన్నారు



