జనంన్యూస్. 08.సిరికొండ. నిజామాబాదు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం లో జరిగిన గిరిజన రైతులు పోడు భూముల అవగాహన సదస్సులో పాల్గొన్న కోదండ రెడ్డిని సిరికొండ మండలం జగదాంబ తండా గ్రామ పెద్దలు పోడు భూముల సమస్యల గురించి తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రజలు ఎదుర్కొంటున్న అటవీ హక్కుల చట్టం గురించి వివరించి మా సమస్యలను పరిష్కరించమని గ్రామ వాసులు విన్నవించారు దీనికిగాను కోదండ రెడ్డి సానుకూలంగా స్పందించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు, అనంతరం శాలువాతో సన్మానించారు, టిఆర్ఎస్ పాలనలో రైతులు ధరణి పేరిట మోసాల పాలయ్యారని చైర్మన్ రైతులకు వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజన బిడ్డలకు రైతులకు పోడు భూముల సమస్యలకు న్యాయం జరుగుతుందని చెప్పారు, ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుగుణ రవి నాయక్, యువ నాయక్ యూత్ అధ్యక్షులు సుదర్శన్ గారు, వార్డు నెంబర్ నితిన్ కుమార్, గ్రామ వ్యవసాయ కమిటీ చైర్మన్ రమేష్ నాయక్, సంతోష్ నాయక్ కాంగ్రెస్ నాయకులు రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.


