జనం న్యూస్ 09 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో (కొప్పులో) దాచుకోవడానికి ప్రయత్నించారు.మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని, సిబ్బంది వారిని నిశితంగా గమనించారు. వారు బంగారాన్ని జడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నిందితులను సోదా చేయగా దొంగిలించిన బంగారం బయటపడింది.పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను ఈ క్రింది విధంగా గుర్తించారు:1.-భోజ నాగమణి 2.-బోజగాని జ్ఞానమ్మ 3.-పొన్నా పద్మ సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు వీరు పాత నేరస్తులా? లేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం, యజమాని అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ భారీ దొంగతనం విఫలమైంది. గాజువాక పరిసరాల్లోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు


