జనం న్యూస్ 09 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
భోగాపురం మండలం నారుపేట జాతీయ రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.
విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న బస్సు, ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ సంఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా బస్సులో ఉన్న సుమారు పది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని 108 అంబులెన్స్లో సుందరపేట సీహెచ్సీకి, డ్రైవర్ను కేంద్రాసుపత్రికి తరలించారు.


