జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని, సిరికొండ గ్రామ సర్పంచ్ సాయి చరణ్ మరియు సిరికొండ గ్రామ పాలకవర్గం సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయి చరణ్ , వార్డు సభ్యులు మురళి.శంకర్ , తిరుపతి.రవిసునీత. సిరికొండ గ్రామంలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయాము ప్రధానంగా మోడల్ స్కూల్‌లో వర్షపు నీటి నిల్వ (రైన్ వాటర్ స్టోరేజ్) సమస్యపై, అలాగే మూడు కల్వర్టుల నిర్మాణం అవసరమని చర్చించాము ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల తరగతి గదులు సరిపోకపోవడంతో అదనంగా రెండు క్లాస్ రూములు నిర్మించాలని వినయపూర్వకంగా అభ్యర్థించాము అదేవిధంగా సిరికొండ గ్రామానికి ఐటీఐ కళాశాల మంజూరు చేయాలని కోరాము పోచమ్మ దేవాలయం నుండి ధోన్ల వాగు వరకు రెండు వైపులా కొత్త డ్రైనేజీ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ కాలనీలో అంగన్‌వాడీ భవనం నిర్మించాలని కోరారు. గ్రామంలో మూడు చోట్ల శ్మశానవాటికల నిర్మాణం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశారు.గ్రామ అవసరాల దృష్ట్యా నాలుగు OHSR వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేయాలని, ఒక్కొక్కటి లక్ష లీటర్ల సామర్థ్యంతో ఉండాలని కోరారు. అలాగే గ్రామంలో లైబ్రరీ భవనం నిర్మించాలని అభ్యర్థించారు. బైపాస్ రోడ్డులో 33 కేవీ విద్యుత్ లైన్ ఇళ్ల మధ్యగా వెళ్లడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆ సమస్యను పరిష్కరించాలని కోరారు. గ్రామంలో సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, కొన్ని ప్రాంతాల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సదుపాయం కల్పించాలని కూడా తెలిపారు.ఈ అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి.సిరికొండ గ్రామ అభివృద్ధిని పటిష్టంగా ముందుకు తీసుకువెళ్లేందుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.


