జనంన్యూస్. 09.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు పోలీస్ ప్రెస్ క్రికెట్ తన అద్భుతమైన బౌలింగ్ తో ప్రెస్ టీంకు సంబంధించి మూడు వికెట్లు పడగొట్టిన సిపి.. ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించిన సిపి సాయి చైతన్య…. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన పోలీస్, ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రారంభించారు. మొదటగా పోలీస్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ చేయగా 132 ప్రత్యర్థి టీం అయిన ప్రెస్ టార్గెట్ విధించారు. 133 పరుగుల లక్ష్యంతో బరిలో ప్రెస్ లెవెన్ జట్టు 12 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 90 పరుగులు మాత్రమే చేసింది. పోలీస్ లెవెన్ జట్టు 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. పోలీస్ లెవెన్ జట్టులో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బౌలింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి 3 ఓవర్లలో మూడు వికెట్లు తీసి పోలీస్ జట్టు విజయానికి దోహదపడ్డారు. అనంతరం మ్యాచ్ ముగిసిన తర్వాత జిల్లా అదనపు కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా హాజరై ఉత్తమ బ్యాట్స్మెన్, ఉత్తమ బౌలర్ కు బహుమానం అందించారు. పోలీస్ జట్టులో 96 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన ఎస్సై కిరణ్ కుమార్ బెస్ట్ బ్యాట్ మేన్ గా బహుమతి అందుకున్నారు. ప్రెస్ లెవెన్ నుండి ఉత్తమ బౌలర్గా శ్యామ్ నిలిచారు. ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచ్ నిత్యం పోలీస్, ప్రెస్ వారు తమ తమ విధుల నిమిత్తం ఒత్తిడికి లోనవుతుంటారని ఇలాంటి ఫ్రెండ్లీ మ్యాచులు నిర్వహించుకోవడం మంచి సంప్రదాయమని వక్తలు పేర్కొన్నారు. అనంతరం ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ను తిలకించడానికి వచ్చిన ప్రెస్ అండ్ పోలీస్ మిత్రులకు మధ్యాహ్నం భోజనం అందించారు. క్రమంలో ఈ కార్యక్రమంలో డిసిపి అడ్మిన్ బసవరెడ్డి ఏసిపి రాజా వెంకటరెడ్డి, సిఐలు,ఎస్సైలు, పత్రిక ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు,



