Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 09 జనవరి

టి ఆర్ పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న కల్వకుంట్ల కవిత గురించి వాస్తవాలు మాట్లాడుతుంటే, ఎందుకు కోపం వస్తుందని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు .వాస్తవాలని భరించలేక పేడు బ్యాచ్ తో మల్లన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేయించడం సరైన పద్ధతి కాదని అన్నారు.మీ కులానికి చెందిన జనాభా రెండు లక్షలు కూడా ఉండరు కానీ బీసీ ఓట్లతో అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు దోచుకున్నారు.ఇప్పుడు బీసీల ఓట్ల కోసం పూటకు ఒక వేషం వేస్తూ జనం బాట అంటూ రోజుకు ఒక ఊరు తిరుగుతూ నాటకాలు వేస్తున్నావు అని కల్వకుంట్ల కవిత తీరుపై మండిపడ్డారు.ఒక ఆడపిల్ల చేయని సార దంద చేసి జైలుకెళ్ళి తిరిగి వచ్చి కన్నతండ్రి సొంత అన్న బావల పైన వ్యాఖ్యలు చేస్తున్న నీకు ఏమాత్రమైనా నీతి నిజాయితీ ఉందా అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు అలాగే తీన్మార్ మల్లన్న ప్రతి ఆడబిడ్డని చెల్లమ్మ, అక్క, అమ్మ అంటూ పలకరిస్తూ సొంతింటి ఆడబిడ్డ లాగా గౌరవిస్తారు. అలాగే పార్టీలో మల్లన్న మహిళలకి చాలా ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు.తీన్మార్ మల్లన్న రాష్ట్రంలో గ్రామాల పర్యటన చేస్తే గనక బీసీలు చొక్కాలజించుకొని రోడ్డుపైకి రావడం ఖాయమని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ ఎలక్షన్స్ లో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మల్లన్న మా ఊరికి తీసుకురండి ఒక్కసారి మల్లన్న చూస్తామని అన్నారని అన్నారు.జాగృతి పెయిడ్ బ్యాచ్ బహిరంగంగా తీన్మార్ మల్లన్న పైన దాడి చేస్తాము అని బహిరంగంగా చెప్తే చూస్తూ ఊరుకోవడానికి మేము చేతికి గాజులు వేసుకొని కూర్చోలేదని జ్యోతి పండాల్ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఉమ్మడి జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హర్ష, జహీరాబాద్ మండల అధ్యక్షుడు రాకేష్, ఝరసంఘం మండల అధ్యక్షుడు సంగమేష్, మొగుడంపల్లి మండల్ సోషల్ మీడియా ఇంచార్జ్ వీరేశం, మహేష్ నర్సింలు శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.