Listen to this article

జనం న్యూస్ 9కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

ఆసిఫాబాద్ :సంస్కృతి సంప్రదాయలను కాపాడుకొని ముందు తరాలకు ఆదర్శం కావాలని సెయింట్ జోయల్స్ ప్రిన్సిపాల్ దేవాబుషణం అన్నరు.సంక్రాంతి పండుగ సందర్భంగా శుక్రవారం
పాఠశాల లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించగా ముగ్గుల పోటీల న్యాయనిర్ణేతలుగా పి జ్యోతి విజయలక్ష్మి లు.వ్యవహరించారు అనంతరం. విజేతలకు బహుమతులు ప్రధానం చేసారు.ఈ కార్యక్రమంలో ట్రాస్మా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ చిలుకూరి రాధాకృష్ణ చారి ప్రోగ్రెస్ స్కూల్ కరస్పాండెంట్ సాబీర్ అబూబుభాకర్.హొలీ ట్రీనిటీ స్కూల్ ప్రిన్సిపాల్ నాగేంద్ర కుమార్ ఆసిఫాబాద్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ బి.నరేందర్ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.