జనం న్యూస్. తర్లుపాడు మండలం. జనవరి 9
తర్లుపాడు గ్రామం నందు పప్పు సెనగ రైతులకు మండల వ్యవసాయ అధికారి ఇండి గ్యాప్ పొలంబడి నిర్వహించారు. ఇంటర్నల్ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఏఈఓ దేవేంద్ర గౌడ్ తో పాటు వి ఏ ఏ సావిత్రి పప్పు సెనగ సాగు చేసిన రైతుల పొలాలను పరిశీలించారు. ఇండి గాప్ పొలంబడిలో ఉన్న రైతులందరూ వారి యొక్క ఫార్మర్ డైరీలను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని సూచించారు. పొలంబడి రైతులు వారు పంటను సాగు చేసినప్పటి నుండి పంట కోత వరకు చేపట్టే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఫార్మర్స్ డైరీలో నమోదు చేయాలని వారికి తెలియజేశారు. ప్రస్తుతం బెట్ట పరిస్థితిలో ఉన్న సెనగను కాపాడుకోవడానికి 13 0 45 తో పాటు నానో యూరియా కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పై పాటుగా అందవలసిన పోషకాలు పంటకు అంది బెట్ట పరిస్థితిని తట్టుకుంటుందని వారికి తెలియజేశారు. కార్యక్రమంలో ఏఈఓ దేవేంద్ర గౌడ్ సావిత్రి తర్లపాడు పప్పు సెనగ సాగు చేసిన రైతులు పాల్గొన్నారు.



