Listen to this article

సాంప్రదాయ దుస్తులతో, రంగులముగ్గులతో అలరించిన విద్యార్థులు

జనం న్యూస్ – జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలోని ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి, ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులతో హరిదాసుల వేషధారణలతో అలరించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఇండియన్ ప్రిన్సెస్ స్కూల్ ప్రిన్సిపాల్ జానిస్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలుగు పండుగల సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనం తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగువారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి పర్వదినాన్ని అందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కోరారు. ముగ్గుల పోటీల వల్ల విద్యార్థులలో సృజనాత్మకత సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జానీస్, పాఠశాల డైరెక్టర్లు హృదయ రాజ్, హేమలత, ఉపాధ్యాయులు ఉపేంద్ర ,వరలక్ష్మి, ఝాన్సీ, సుజాత, రాధా, అరుణ, ఇందిరా, అనూష, ఉష ,రూతు ,హసీనా, ఝాన్సీ, రోజా రాణి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.