Listen to this article

జనం న్యూస్:జనవరి 9 (రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)


మార్కాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ అడిషనల్ గవర్నమెంట్ ప్లిడర్ ( AGP )గా తర్లుపాడు కు చెందిన న్యాయవాది వనపర్తి నాగేంద్ర రాజు నియామకమయ్యారు.ఈ మేరకు శుక్రవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు.ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ కేసులలో న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు,ప్రభుత్వం తరుపున కోర్టులో వాదనలు వినిపించునున్నారు.మూడేళ్ల పాటు ఈయన ఆ పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా AGP నాగేంద్ర రాజు మాట్లాడుతూ తన పదవి రాకకు సహకరించిన మార్కాపురం MLA కందుల నారాయణ రెడ్డి గారికి ప్రత్యేకoగా కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన ఈ బాధ్యతను సమర్ధవంతoగా నిర్వర్తిస్తాననీ నాగేంద్ర రాజు అన్నారు.ఈ సందర్బంగా నూతన AGP గారికి పలువురు సీనియర్ & జూనియర్ న్యాయవాదులు కలిసి అభినందనలు తెలిపారు.