Listen to this article

కమిషనర్ కు వినతి పత్రం అందించిన కార్మిక నాయకులు

జనం న్యూస్- జనవరి 9- నాగార్జునసాగర్ టౌన్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి ఆరు నెలలుగా అందని జీతాలను వెంటనే చెల్లించాలని నందికొండ మున్సిపల్ కమిషనర్ చింతా వేణుకు సిఐటియు జిల్లా నాయకులు ఎస్. కె బషీర్ మున్సిపాలిటీ సిబ్బందితో కలిసి శుక్రవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలో వివిధ రంగాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి అధికారులతో మాట్లాడి మున్సిపల్ సిబ్బందికి వెంటనే జీతాలు అందేలా చూడాలని కమిషనర్ ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రవి నాయక్, కృష్ణారెడ్డి, నందికొండ మున్సిపల్ సిబ్బంది శివ, తాహెర్ తదితరులు పాల్గొన్నారు.