Listen to this article

టిఆర్పి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత.

జనం న్యూస్, జనవరి 09, జగిత్యాల జిల్లా మెట్ పల్లి:

పట్టణంలోని తన నివాసంలో టిఆర్పి జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగె రజిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న పై అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కల్వకుంట్ల కవిత బ్యాచ్ పై మండిపడ్డారు. మీ అయ్య కేసీఆర్ తెలంగాణ ప్రజలను తాగుడికి బానిస చేస్తే దానికి నువ్వు రాణిగా ఉన్నందున ప్రజలు లిక్కర్ రాణి అని బిరుదు ఇచ్చారని గుర్తు చేశారు. బిసి ప్రజలకు డబ్బులు వెధజల్లి తీన్మార్ మల్లన్న పై ఉసిగొలిపి పైశాచిక ఆనందం పొందుతున్నావని అన్నారు.రానున్నది బీసీల రాజ్యమే దానికి ముఖ్యమంత్రి తీన్మార్ మల్లన్న గుర్తుపెట్టుకో కవిత ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడమని మీ కార్యకర్తలకు చెప్పమని రజిత హెచ్చరించారు.