Listen to this article

జనం న్యూస్‌ 10 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

తెలుగుదేశం పార్టీ నాయకుడు అడపా సూర్యనారాయణ మృతి పట్ల విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మరియు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.శనివారం గరివిడి మండలం కోడూరు గ్రామంలో సూర్యనారాయణ స్వగృహానికి వెళ్లిన చిన్న శ్రీను, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శోకతప్త హృదయంతో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి వారిని ఓదార్చారు. రాజకీయాలకు అతీతంగా అడపా సూర్యనారాయణ అందించిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సూర్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన ప్రార్థించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో:మీసాల విశ్వేశ్వరరావు, వల్లి రెడ్డి లక్ష్మణ్, జనార్దన్ రావు మరియు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.