జనం న్యూస్ 10 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం తదితర రైల్వే స్టేషన్లలో రన్నింగ్లో వెళుతున్న రైళ్లలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు జిఆర్పి ఎస్ఐ బాలాజీ రావు తెలిపారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన పాపుసేతు (26)ను విజయనగరం రైల్వే స్టేషన్లో సెల్ ఫోన్ దొంగిలిస్తుండగా పట్టుకున్నామన్నారు. గతంలో ట్రైన్ నుంచి సుమారు రూ.2 లక్షల విలువచేసి 6 సెల్ ఫోన్లు చోరీ చేశాడన్నారు.


