జనం న్యూస్ జనవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
శాయంపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కందకట్ల కోటేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశంలోని యువత కీలక పాత్రపై వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కళాశాలలో వ్యాసరచన ఉపన్యాస పోటీలు స్వామి వివేకనంద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సుభాషిణి, ప్రసాదరావు, హిమబిందు, శైలేంద్ర, సునిల్ కుమార్, వేణు, కల్పన, రవీంద్రనాయక్, తిరుపతి, సౌజన్య, శ్రీనివాస్, వివేకానంద ఉత్సవ కమిటీ మండల అధ్యక్షుడు గిద్దెమారి సురేష్, నర్సిరెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు…..


