బిచ్కుంద జనవరి 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మరియు కామారెడ్డి జిల్లా డిసిసి చైర్మన్ ఏలే మల్లికార్జున్ బిచ్కుంద శ్రీ సద్గురు బండాయప్ప పీఠాధిపతి శ్రీ సోమలింగ శివాచార్య తో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే గారికి కూడా శాలువాతో సన్మానం మరియు కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు మొదటిసారిగా బిచ్కుంద గ్రామానికి వచ్చిన సందర్భంగా మఠాధిపతి సోమలింగ శివాచార్యులు శాలువాతో సత్కారం చేశారు.ఇట్టి కార్యక్రమంలో అప్పతోపాటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్ పట్టణ అధ్యక్షుడు సాయిల్ సెట్ కార్, కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్ ,పుల్కల్ మాజీ సొసైటీ చైర్మన్ వెంకట్ రెడ్డి బండు పటేల్ మాజీ జెడ్పిటిసి నాగనాథ్, సీమ గంగారం, ప్రేమ్ సెట్, మైనార్టీ నాయకుడు ఖలీల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు



