జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి
సాధారణంగా ముఖ్యమంత్రి అధికారిక కార్యక్రమాలు చాలా సిస్టమేటిక్ గా ఉంటాయి. ప్రోటోక్రాల్ తప్పనిసరి. సియం కార్యాలయం నుండి మొత్తం ప్రభుత్వ యంత్రాగం షెడ్యూల్ రూపకల్పన చేస్తారు. షెడ్యూల్ లో లేని కార్యక్రమానికి ఎట్టి పరిస్దితులలోనూ ముఖ్యమంత్రి హాజరుకారు. రూల్స్ ఖచ్చితంగా పాటించే చంద్రబాబు అయితే మరీ కష్టం. విభజిత ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అయిన తర్వాత సియం హోదాలో ఆయన ఏనాడూ షెడ్యూల్ లో రూపొందించని కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాలు లేవు. కానీ ఆయన ఈరోజు ఆరూల్స్ బ్రేక్ చేసి మరీ మూలారెడ్డి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాయవరంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ నల్లమిల్లి మూలారెడ్డి వారి విగ్రహావిష్కరణ కార్యక్రమం వాస్తవానికి చంద్రబాబు వారి నేటి పర్యటనలో లేదు. మొన్నటి రోజు వరకూ ఈ ఆలోచన లేకపోవడంతో ముఖ్యమంత్రి కార్యాలయం షెడ్యూల్ రూపకల్పన చేసేసింది. బుధవారం నాడు కార్యకర్తల సూచనతో ఎమ్మెల్యే లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి , వేగుళ్ళ జోగేశ్వరరావు కలసి పోలవరం పర్యటనలో ఉన్న చంద్రబాబు వారి కి చెప్పడం ఆయన వెంటనే నిమిషం కూడా ఆలోచించకుండా ‘మూలారెడ్డి వారి విగ్రహావిష్కరణ గురించి నాకు ప్రత్యేకంగా చెప్పాలా? చేసేద్దాం’ అన్నారు. అప్పటికప్పుడు ప్రభుత్వం షెడ్యూల్ లో మార్పుచేర్పులు చేయడం అంత ఈజీ కాదు పైగా ప్రజావేదికలు యేడాదిన్నరగా నిర్వహిస్తూ వస్తున్నారు. వాటిలో ప్రభుత్వ కార్యక్రమాలే తప్ప పార్టీ కార్యక్రమాలేవీ చేయడం లేదు. ఇదే అభ్యంతరాన్ని అధికారులు లేవనెత్తారు కానీ మూలారెడ్డి పై బాబు వారి కి ఉన్న గౌరవం, రామకృష్ణారెడ్డి వారి పై ఉన్న నమ్మకం చంద్రబాబు సైతం రూల్స్ బ్రేక్ చేసేలా చేసింది. పార్టీ పౌండర్ మెంబర్ కి మనం గౌరవం ఇవ్వాల్సిందేనంటూ షెడ్యూల్ లో లేకుండానే చంద్రబాబు మూలారెడ్డి వారి విగ్రహావిష్కరణకు వచ్చారు. పార్టీ కోసమే జీవితం మొత్తం అంకితం చేసిన దివంగత నేత విగ్రహాన్ని ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు చంద్రబాబు


