Listen to this article

జనం న్యూస్ జనవరి 10 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పై, అసత్య వార్తలు రాసిన న్యూస్ 10 పత్రిక యాజమాన్యంపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్ (బుజ్జన్న) డిమాండ్ చేశారు. శాయంపేట మండల కేంద్రంలో న్యూస్ 10 వ్రాసిన వార్తల ప్రతులను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ మాట్లాడుతూ న్యూ 10 పత్రిక యాజమాన్యం ఆధారాలు లేకుండా ఎమ్మెల్యే పై అసత్య కథనాలు రాసి మనోవేదనకు గురి చేశారని ఆవేదన చెందారు. ఇందుకుగాను నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సాధారణ కేసులను నమోదు చేశారని అన్నారు. ఇప్పటికైనా పత్రికా యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని లేనిపక్షంలో పోలీసులు వారిపై వెంటనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యేంతవరకు శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారపల్లి వరదరాజు, మసికే కుమారస్వామి, తహరాపూర్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య, పార్టీ నాయకులు ముక్కెర ప్రేమ్ సాగర్, వినుకొండ శంకరాచారి, మారేపల్లి రంగు బాబు తదితరులు పాల్గొన్నారు.