తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 10 జనవరి
విద్యార్థులకు సంక్రాంతి పండుగ విశిష్టను తెలియజేస్తూ, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా శ్రీ చైతన్య కళాశాల ఆవరణంలో సత్యనారాయణ సేవ సమితి సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గం NSUI నిర్వహించిన ముగ్గుల పోటీలో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులపై చదువు ఒత్తిడి లేకుండా క్రీడాలవైపు కూడా ప్రోత్సహించాలని సూచించారు. సమాజంలో విద్యా ఒక్కటే మన గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెడుతుందని తెలిపారు. మన సాంప్రదాయాలను పాటిస్తూ సమాజంలో పెద్దల పట్ల నడుచుకోవాలని, ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్నట్లు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రులకు మంచి పేరు తేవడం వాళ్ల మన తెలంగాణ కీర్తిని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి NSUI విభాగం అధ్యక్షుడు చంద్ర మౌలి, సహకరించిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందన బహుమతితో పాటు మొదటి ఐదు ఉత్తమ ముగ్గులకు ఆర్దిక పారితోషకం అందజేశారు అనిల్ కుమార్ యాదవ్. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు సాహితి, మహేష్, పూర్వ 106 డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్, విద్యార్థి నాయకులు లవన్, వినయ్,ఇమ్రాన్,జగదీష్, దిలీప్,ఆజాం, అరుణ్ తదితరులు పాల్గొన్నారు



