Listen to this article

వీణవంక మండలం కొండపాక గ్రామంలో అక్రమ ఇసుక నిల్వలు

జనం న్యూస్, జనవరి 10,కుమార్ యాదవ్, జిల్లా ఇంచార్జ్

వీణవంక మండలం కొండపాక గ్రామం లో ప్రధాన రహదారులపై అనుమతి లేకుండా ఇసుకను కుప్పలు కుప్పలుగా నిల్వ చేయడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గ్రామాల మధ్య రోడ్లపై, నివాస ప్రాంతాలకు సమీపంలో ఇసుక వేయడం వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ధూళి కారణంగా ప్రజలకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను వెంటనే తొలగించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి రహదారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.