Listen to this article

జనం న్యూస్‌ 12 జనవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్‌ క్రైమ్‌ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు