

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.నందలూరు అల్ హాది వెల్ఫేర్ & హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ఆధ్వర్యంలో,కువైట్ ప్రవాస నందలూరు యూత్ సహకారంతో 09-02-2025 ఆదివారం నందలూరు బస్టాండ్ లోని వైయస్సార్ విగ్రహం వద్ద మెగా వైద్య, రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ చైర్మన్ మహమ్మద్ ఇబ్రహీం, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ సయ్యద్ నజీర్, జిల్లా సలహాదారుడు షేక్ కరిముల్లా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య శిబిరంలో చిన్న పిల్లలకు, వయోవృద్ధులకు, కంటి సమస్యలకు, కీళ్ల సమస్యలకు, కిడ్నీ సంబంధిత సమస్యలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక పరీక్షలతో పాటు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ శిబిరంలో కడపకు చెందిన ప్రముఖ కీళ్ల వైద్యులు డాక్టర్ జహంగీర్, కంటి వైద్యులు డాక్టర్ ఆసిఫ్, చిన్నపిల్లల స్పెషలిస్ట్ సయ్యద్ ఫరూక్ హుస్సేన్, మధుమేహ సమస్యలకు డాక్టర్ జయ భాస్కర రావు, కిడ్నీ సంబంధిత వైద్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఎండి జనరల్ డాక్టర్ రబ్బాని పర్యవేక్షణలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులతో పాటు వైద్యుల సూచన మేరకు ఈసీజీ వంటి పరీక్షలు కూడా ఉచితంగా చేస్తామన్నారు .