జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి వివేకానంద నగర్ డివిజన్‌లో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వామి వివేకానందుని ఆదర్శాలు, బోధనలు అనుసరించి ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద నగర్ కాలనీలోని ప్రధాన రహదారిపై ఉన్న స్వామి వివేకానంద విగ్రహానికి భాస్కర్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తి, కర్తవ్యనిష్ఠను పెంపొందించడమే స్వామి వివేకానంద సందేశమని తెలిపారు. వ్యక్తిగత జీవితం నుంచి సమాజ సేవ వరకు వివేకానంద మార్గదర్శనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయభాస్కర్ రెడ్డి, చంద్రారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, నరసయ్య, సూర్యప్రకాశ్ రావు తదితరులు హాజరై స్వామి వివేకానందకు నివాళులు అర్పించారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో ముగిసింది



