Listen to this article

జనం న్యూస్ 12డిసెంబర్. కొమురం భీమ్ జిల్లా. జిల్లా స్టాఫ్ఫర్.

జైనూర్ :ఆదివాసి సమాజానికి వెలుగు దీపాలుగా నిలిచిన ఆదివాసి ఆత్మబంధువులు ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ & బెట్టి ఎలిజబెత్ 39వ వర్ధంతి సభను జనవరి 11వ తేదీన, కొమురం భీం జిల్లా, జైనూర్ మండలం, మార్లవాయి గ్రామంలో ఆదివాసి సంప్రదాయాలు–సంస్కృతి నడుమ ఘనంగా నిర్వహించాము.
గత 39 సంవత్సరాలుగా ఆదివాసి సమాజం అభిమానంతో, భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న ఈ వర్ధంతి సభను ఈ సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమానికి విచ్చేసి సభను విజయవంతం చేసిన అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నాగేష్, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు,కొమురం భీం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నికిత పంత్,ఉట్నూర్ ఐటిడిఏ పిఓ యువరాజ్ మర్మాట్,
కొమురం భీం జిల్లా డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క,మానవహక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు ఆత్రం భుజంగరావు,ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్,జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విశ్వనాథ్,ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంగ,రాజు గోండ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెస్రం గంగారం,గోండ్వానా జాతీయ నాయకులు సిడం అర్జున్,రాయి సెంటర్, కొమురం భీం జిల్లా మేడి కుర్సెంగ్ మోతిరామ్,ఆదిలాబాద్ జిల్లా మేడి తొడసం అమృత్ రావ్,రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెందోర్ సుధాకర్, తోటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మర్సు కొల తిరుపతి,ప్రాధన్ సంఘం రాష్ట్ర నాయకులు మేశ్రం మనోహర్ అలాగే ఆసిఫాబాద్ జిల్లా డిటిడిఓ రమాదేవి, జైనూర్ ఏటిడిఓ శ్రీనివాస్,
ఎంపీడీవో సుధాకర్ రెడ్డి, జైనూర్ తహసీల్దార్ ఆడ భీర్ షా, జైనూర్ మెడికల్ ఆఫీసర్, జైనూర్ సీఐ రమేష్, ఎస్సై రవీందర్ సిర్పూర్ (యు) ఎస్సై రామకృష్ణారావు, లింగాపూర్ ఎస్సై గంగన్న,ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి వచ్చిన నూతన సర్పంచులు,పద్మశ్రీ కనక రాజు గుస్సాడి బృందం – టీం లీడర్ కనక సుదర్శన్,
మీడియా మిత్రులు,ఐటిడిఏ ఉట్నూర్ ఇంజనీరింగ్ శాఖ, . ఐటి డి ఏ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు మరియు సిబ్బందికి,విద్యుత్,ఆరోగ్య,రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖల, వ్యవసాయ శాఖ,శిశు సంక్షేమ శాఖ, పోలీస్ శాఖ, అధికారులు,ఆదివాసి సంఘ నాయకులు, రాయి సెంటర్ సార్ మీడిలు,రాజ్ గోండ్ సేవా సమితి సభ్యులు,ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు,క్రీడాకారులు, కళాకారులు, అధికారులు,హైమన్ డార్ఫ్ అభిమానులు, శ్రేయోభిలాషులు మరియు ముఖ్యంగా ఈ సభను భుజాలపై మోసిన మార్లవాయి గ్రామస్తులు, హైమన్ డార్ఫ్ యూత్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు.మీ అందరి సహకారం వల్ల ఈ 39వ వర్ధంతి సభ విజయవంతమై, డార్ఫ్ దంపతుల సేవలను మరోసారి స్మరించుకునే అవకాశం కలిగింది.ఇదే విధంగా ఆదివాసి సమాజ ఐక్యత, సంస్కృతి, అభివృద్ధి కోసం మీ సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలని ఆకాంక్షిస్తూ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదములు
– కనక ప్రతిభ వెంకటేశ్వర్ రావ్ సర్పంచ్, మార్లవాయి గ్రామపంచాయతీ