జనం న్యూస్ జనవరి 12 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి, వసంత నగర్ డివిజన్:ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందనడానికి మరో నిదర్శనంగా కూకట్పల్లి నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధి పనులు రూపుదిద్దుకుంటున్నాయి. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన పర్యటనలో భాగంగా యన్ఆర్ ఎస్ఎం కాలనీ, డైమండ్ హిల్స్, సిబిసిఐడి కాలనీలను సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా కాలనీల ప్రజలు తమ ప్రాంతాల్లోని రోడ్ల దయనీయ స్థితిని బండి రమేష్ దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల అభ్యర్థనకు స్పందించిన ఆయన వెంటనే సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించి, రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేశారు. ఫలితంగా రోడ్డు అభివృద్ధి పనుల కోసం వర్క్ ఎస్టిమేషన్లు సిద్ధం చేయించారు.సిబిసిఐడి కాలనీ రోడ్డు పనులకు – రూ. ఇరవై ఐదు లక్షలు యన్ఆర్ఎస్ఎ కాలనీ మరియు డైమండ్ హిల్స్ రోడ్డు పనులకు రూ. 35.5 లక్షలు ఇంజనీరింగ్ అధికారులు త్వరలో టెండర్లు పిలిచి, రోడ్డు పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇదివరకే గోపాల్ నగర్‌లో రూ. యనబై లక్షల వ్యయంతో రోడ్డు పనులు ప్రారంభం కాగా, డైమండ్ హిల్స్ ప్రాంతంలో ఐమాక్స్ లైట్లు, వీధి దీపాల ఏర్పాటు కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. ఇవన్నీ ప్రజల సౌకర్యాన్ని, భద్రతను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.ప్రజల సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి పనులు నిజమైన ప్రజా పాలనకు ప్రతీకగా నిలుస్తున్నాయని స్థానిక నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా కూకట్పల్లి ప్రజల తరఫున బండి రమేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కూకట్పల్లి వైస్ చైర్మన్ లక్ష్మయ్య కి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


