Listen to this article

జనం న్యూస్ ; 12 జనవరి సోమవారం ;సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్

యువతకు దిక్సూచి స్వామి వివేకానందుడు అని ఆయన చూపిన మార్గములో యువత పయనించి దేశాభివృద్దికి పాటుపడాలని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.సోమవారము స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని సిద్దిపేటలో ఉన్న ఆయన విగ్రహానికి ట్రస్మా నాయకులు యల్లా భాస్కర్ రెడ్డి,బలనగరాజు,చిన్న, మొహన్ కుమార్, ఎం.వి ఐ శంకర్ నారాయణ , ఎ.ఎం.వి ఐ శ్రీకాంత్ రెడ్డి గార్లు కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎం.వి ఐ శంకర్ నారాయణ మాట్లాడుతూ వివేకానందుని స్ఫూర్తి తీసుకొని యువత ముందుకు సాగాలనిపిలుపు నిచ్చారు.