Listen to this article

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 12 జనవరి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు పరిచయం అవసరం లేని పేరు పి.జనార్దన్ రెడ్డి. నాడు ప్రతి పేదవాడికి నివాసం ఉండాలని, సొంతింటి కల నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన స్వపక్షలోనైనా విపక్ష నాయకుడై వేల ఎకరాల భూములను పేదలను అందించిన మహా నాయకుడిగా, మహానగరానికి తాగునీటిని అందించి నగరానికి భగీరదుడైనాడని, కార్మిక లోకానికి ఎనలేని సేవలందించి కార్మిక దేవుడిగా ప్రజలందరూ పీజేఆర్ అంటూ హక్కున చేర్చుకొన్నారని పీజేఆర్ జయంతి సందర్భంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన కార్యక్రమల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని కొనియాడారు. కార్యక్రమంలో శేరీలింగంపల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గఫూర్, ఆజాం యువజన, విదార్థి విభాగాల నాయకులు శ్రీకాంత్,మహేందర్,లవ కుమార్,వినయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు