Listen to this article

బిచ్కుంద జనవరి 12 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలోని బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డుల తుది ఓటర్ల జాబితాను మున్సిపల్ కమిషనర్ హయుం సోమవారం నాడు విడుదల చేశారు, 12.759 మంది ఓటర్లు ఉండగా. వీరిలో పురుషులు 6.201. మహిళలు 6.556. ఇతరులు ఇద్దరు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ఓటర్ల నుంచి వచ్చిన 99 అభ్యంతరాలను పరిష్కరించి జాబితా రూపొందించామన్నారు. ఓటింగ్ కోసం పట్టణంలో 24 పోలింగ్ కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు