జుక్కల్ జనవరి 12 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం పడంపల్లి గ్రామం లో స్వామి వివేకానంద 163వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగ్రామ్ టీచర్ మాట్లాడుతూ, స్వామి వివేకానంద జీవితం, ఆయన యువతకు అందించిన ప్రేరణ, దేశాభివృద్ధిలో యువశక్తి పాత్ర గురించి, విద్యార్థులు, యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అలవరుచుకుని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని వివరించారు. యువ నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ వివేకానంద బోధనలు నేటి యువతకు మార్గదర్శకమని, వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి రాజు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ సవిత శ్రీనివాస్,మల్లికార్జున్ కాంటాక్ట్, బిజెపి నాయకుడు ప్రశాంత్ పటేల్, సంతోష్ హనుమజీవార్ వీరభద్ర, మాధవరావు సంజు తదితరులు పాల్గొన్నారు


