Listen to this article

జనం న్యూస్ జనవరి 12, వికారాబాద్ జిల్లా

పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే TRR .పరిగి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆసుపత్రి కమిటీ సమావేశంలో పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామోహన్ రెడ్డి, పాల్గొన్నారు.ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న సేవలు, సదుపాయాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం రూ.27 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే TRR, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.