జనం న్యూస్ 13 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కుటుంబ సభ్యులకు నమస్కారం ఈరోజు బిసి కాలనీ 37 వ డివిజన్ లో బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ మరియు కుసుమంచి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిరుపేద కుటుంబాలకు చీరలు పంపిణీ కార్యక్రమం ఎస్పీఎం స్కూల్లో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుసుమంచి సుబ్బారావు గారు బీసీ కాలనీ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ సొసైటీ గౌరవ సలహాదారులు పిడకల ప్రభాకర్ గారు వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పత్తి గుల్ల వెంకట్రావు గారు సలహాదారులు సాంబ మూర్తి రాజు గారు రెడ్డిపల్లి అప్పలరాజు గారు కామేశ్వరావు గారు కర్రీ రామ్ నాయుడు గారు గోవింద్ గారు లెక్చరర్ శ్రీనివాస్ తాతయలు పవన్ సత్య రావు గారు గణేష్ గారు ఎన్ సాంబమూర్తి ఆర్టీసీ సుబ్బారావు పైడ్రాజు రిపోర్టర్ మరియు బీసీ కాలనీ మహిళా కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది


