జనం న్యూస్ జనవరి 13.నిజామాబాద్ జిల్లా
వేల్పూరు ఎక్స్‌రోడ్ వెళ్లే మార్గంలో ఉన్న అమీనాపూర్ (సీతారాంపల్లె) సమీపంలోని శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వేల్పూర్ శివాలయంలో మంగళవారం స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.యువతకు స్ఫూర్తిదాయకుడు, భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తంగా చాటిన చైతన్యమూర్తి స్వామి వివేకానంద జయంతి సభకు శివాలయం వ్యవస్థాపక కమిటీ చైర్మన్ పన్నాల రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షత వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలుగు గుట్ట శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు, పరమహంస పరివ్రాజకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలయోగి మంగి రాములు మహారాజ్ (శ్రీ శ్రీ శ్రీ కేదారానంద స్వామీజీ) హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.“యువశక్తి – దేశభక్తి” అనే అంశంపై మంగి రాములు మహారాజ్ ఆధ్యాత్మిక ప్రసంగం చేసి యువతలో దేశభక్తి భావనను పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్‌కు హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను మంగి రాములు మహారాజ్ బహుకరించి ఆశీర్వదించారు. భగవద్గీతను స్వామీజీ అమృతహస్తాల ద్వారా స్వీకరించడం తనకు అమితానందాన్ని కలిగించిందని కంకణాల రాజేశ్వర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అవధూత రామకృష్ణానంద స్వామి, కోరెం గోపి స్వామి, పాకాల దశాగౌడ్, బొంపెల్లి గంగాధర్ గుప్తా, వడ్నాల రమేశ్, సీతారాంపల్లె సర్పంచ్ గుండెం సౌందర్య నవీన్, మోతె సర్పంచ్ డొల్ల రమేశ్ రెడ్డి, వివిధ గ్రామాల భజన కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


