

పెద్దకర్మ (తేర్వి) కోసం 7000 వేల రూపాయల నిత్యావసర సరుకులు అందజేత ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉండటమే అభ్యుదయ ఫౌండేషన్ లక్ష్యం రాథోడ్ యువరాజ్ టీచర్లింగాపూర్ :మండల కేంద్రానికి చెందిన పేద రైతు ఆడే ఇందల్ గత కొద్దిరోజుల క్రితం పరమావదించారు. ఈ సందర్భంగా అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు బుధవారం బాధితుని ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మనోధైర్యాన్ని కల్పించారు. మృతుని పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. పెద్దకర్మ కార్యక్రమం కోసం అభ్యుదయ ఫౌండేషన్ గౌరవ సభ్యులు రాథోడ్ యువరాజ్ ఉపాద్యాయులుజాధవ్ సుశీల్ కుమార్, జాధవ్ జైల్సింగ్, పార్డే కిరణ్, దవనే విశ్వకాంత్, జాధవ్ మారుతీ, రాథోడ్ ధర్మేందర్, రాథోడ్ రాజేష్ కుమార్, జాధవ్ రంజిత్, జాటోత్ దవిత్ కుమార్ వారి సహకారంతో గురువారం సామాజిక సేవలో భాగంగా బాధిత కుటుంబానికి సహాయం చేయాలనే మానవతా దృక్పథంతో రూ.7000వేల రూపాయల నిత్యావసర సరుకులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.భవిష్యత్తులో కూడా బాధిత కుటుంబానికి అభ్యుదయ ఫౌండేషన్ ద్వారా అండగా ఉంటామని ఫౌండేషన్ సభ్యులు జాటోత్ దవిత్ కుమార్ భరోసానిచ్చారు. ప్రజలు ఏ కష్టంలో ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఆడే ఇందల్ గారు మనలో భౌతికంగా లేకపోయినా వారి మానవీయ భావాలు ఎల్లప్పుడూ ప్రజల్లోనే ఉంటాయని సభ్యులు తెలిపారు. యువత ఇలాంటి సామాజిక సేవలో ముందుండాలని అభ్యుదయ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.