జనం న్యూస్ 14 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నిన్న అనగా తేది 13/01/2026 ఉదయము నందిక పుష్పమ్మ w/o లేట్ అంజయ్య,వయసు 50 సంవత్సరాలు,కులము:.ఎస్. సీ. మాదిగ, బొబ్బిలి పట్టణంలో ఉన్న సంఘ వీధి మూడవ వార్డ్, బొబ్బిలి టౌన్ విజయనగరం జిల్లా అను ఆమె తన భర్త అంజయ్య కలసి తన ఇంటి వద్ద నుండి బయల్దేరి రాజాంలో తన బావగారి 12వ రోజు కార్యక్రమమునకు వెళ్ళుటకు బొబ్బిలి బలిజిపేట రోడ్ చర్చ్ జంక్షన్ వద్ద బస్సు కోసం నిలుచని ఉండగా సుమారు ఉదయం 9 50 నిమిషాల సమయం లో AP 35Y 4569 నెంబర్ గల ఆర్ టీ సీ బస్సు కాంప్లెక్స్ వైపు నుండి చర్చ్ సెంటర్కు రాగా బస్సు ఆగగా ఫిర్యాదు బస్సు ఎక్కుతుండగా ఫిర్యాదు భర్త చర్చి వైపు నిలబడి ఉండి బస్సు ఎక్కుటకు బస్ ముందునుండి వస్తుండగా సదరు బస్ డ్రైవర్ నిర్లక్ష్యము గా, అజాగ్రత గా , దుందుడుకు గా బస్ ను నడిపి గద్దించి నందున అంజయ్య రోడ్డుపై పడిపోగా ముందు చక్రంతో కుమ్మించినందున పై నుండి వెళ్ళటం వలన కుడి, ఎడమ, చేతులు మరియు ఎడమ కాలుకు తీవ్రమైన రక్త గాయము లై అక్కడ కక్కడే మరణించి నట్లు అక్కడ ఉన్నవారి సహాయము తో బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకొని వచ్చి నట్లు ఆక్సిడెంట్ చేసిన బస్ డ్రైవర్ రౌతు శంకరరావు పై చర్యలు తీసుకోమని రిపోర్ట్ చేయగా సదరు రిపోర్ట్ పై వి.జ్ఞానప్రసాద్, ఎస్. ఐ, బొబ్బిలి పి ఎస్ కేసు నమోదు పరిచి దర్యాప్తు చేయుచున్నారు


