Listen to this article

ఎస్సీ, ఎస్టీలకు కలిపి 15 శాతానికి పైగా..

తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 జనవరి

మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లపై బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ డెడికేటెడ్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సోమవారం నివేదిక సమర్పించింది. మున్సిపాలిటీల వారీగా వార్డులు, ఛైర్‌పర్సన్ల స్థానాలకు బీసీ రిజర్వేషన్లను పేర్కొంది. మొత్తం 50 శాతం రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తీసివేయగా మిగిలినవి బీసీలకు కేటాయించింది. గ్రామాలతో పోల్చితే పట్టణాల్లో ఎస్సీ, ఎస్టీ జనాభా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు కలిపి దాదాపు 15 శాతానికిపైగా రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు సమాచారం. బీసీలకు 34 శాతానికిపైగా రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. కమిషన్‌ నివేదిక ఆధారంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా రిజర్వేషన్లను ఒకటి, రెండు రోజుల్లో ఖరారు చేసే అవకాశం ఉంది. అనంతరం తుది నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి పురపాలక శాఖ అందజేస్తుంది.రాష్ట్రంలో 52,42,993 మంది ఓటర్లు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న 117 పురపాలికలు, ఆరు కార్పొరేషన్లలో మొత్తం 52,42,993 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఓటర్లలో 25,62,358 మంది పురుషులు కాగా, 26,80,005 మంది మహిళా ఓటర్లు, 630 మంది ఇతరులు ఉన్నట్లు పేర్కొంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా తుది ఓటర్ల జాబితాను సోమవారం ప్రచురించారు.త్వరలో షెడ్యూలు! రిజర్వేషన్లపై పురపాలక శాఖకు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక సమర్పించడంతో పాటు ఓటర్ల తుది జాబితా ప్రచురితం కావడంతో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయినట్లయింది. ఎన్నికల సంఘం త్వరలో షెడ్యూలు వెలువరించే అవకాశం ఉంది…