తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మోహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ 14 జనవరి
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వరుస చేరికలతో ఊపందుకున్న బిసి నినాదం – జ్యోతి పండాల్
ఈ రోజు లాల్సాబ్ గడ్డ మున్సిపల్ ఏరియా, సంగారెడ్డి నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా నుండి బారి ఎత్తున్న మైనారిటీ సోదరులు చేరడం జరిగింది.ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ కడువ వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది, అలాగే మొహమ్మద్ నవాజ్ గారిని మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ ప్రతి గ్రామ స్థాయిలో తీన్మార్ మల్లన్న పోరాటం ప్రజలకు చేరుతుందని అన్నారు. మా బిసి ఉద్యమాన్ని “టీఆర్పీ చైతన్య బాట” ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నాము అని మరియు మా వాటాని మేము ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అని మేము మాకున్న అక్కుతో సాధించుకుంటాము అని జ్యోతి పండాల్ వ్యాఖ్యానించారు.తర్వాత మైనారిటీ సోదరులు టీఆర్పీ నాయకులని (జ్యోతి పండాల్, రమేష్ యాదవ్ మరియు అనిల్ కుమార్) గార్లని సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టీఆర్పీ నాయకులు రాష్ట్ర కార్యదర్శి రమేష్ యాదవ్ , సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ , మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు నవాజ్ , మీడియా మిత్రులు యదాన్న , మైనారిటీ సోదరులు, నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.


