జనం న్యూస్ జనవరి 14 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం ప్రజలకు ప్రభుత్వానికి నవతెలంగాణ పత్రిక దిక్సూచి లాంటిదని, నవతెలంగాణ మన అందరి పత్రిక అని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అన్నారు. మండల కేంద్రంలో ని రైతు వేదికలో నవ తెలంగాణ నూతన సంవత్సర (2026) క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక నిజాలను నిర్భయంగా స్వేచ్ఛగా రాయగలదని తెలిపారు.అంచలంచెలుగా ఎదిగి పతాక స్థాయికి చేరిందని కొనియాడా రు.ప్రజల మన్ననలు పొంది నిఖార్సయిన వార్తలను అందిస్తున్న దని అన్నారు. భవిష్యత్తులో మరింత స్థాయికి ఎదిగి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు ఈ కార్యక్రమంలో శాయంపేట రిపోర్టర్ నర్సయ్య వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ మారెపల్లి (బుజ్జన్న) రవీందర్ చింతల రవిపాల్ చల్ల చక్రపాణి,చిందం రవి తహారపూర్ మాజీ సర్పంచ్ రేణికుంట్ల సదయ్య,మాందారి పేట్ సర్పంచ్ రమేష్ ఐలయ్య, యూత్ అధ్యక్షుడు సాధు నాగరాజు తదితరులు పాల్గొన్నారు…..


