Listen to this article

జనం న్యూస్ 15జనవరి పెగడపల్లి

జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని ఐతిపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు భోగి పండుగతో ప్రారంభమైనాయి. భోగి రోజున సూర్యోదయానికి ముందు నిద్రలేచి ఇంటి ముందు భోగి మంటలు వేయడం ఒక ఆచారం పాత వస్తువులను పనికిరాని సామాగ్రిని ఈ మంటలో వేయడం వెనుక లోతైన అర్థం ఉంది భోగి అంటే భోగభాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం గత ఏడాదిలో మనకు ఎదురైన చేదు అనుభవాలను మనసులో ని చెడు ఆలోచనలను అగ్నిదేవునికి సమర్పించి పవిత్రమైన మనసుతో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే ఈ పండుగ ఉద్దేశం. ఈ మంటల నుండి వచ్చే వేడి శీతాకాలంలో శరీరానికి శక్తినివ్వడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న సూక్ష్మ క్రిములను కూడా నశింపజేస్తుంది. మహిళలు చిన్న పెద్ద వారు అంతా భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకున్నారు భోగి పండుగ సంబరాలు చేసుకున్నారు.