సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి. 16
కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామస్థుల ఐక్యతను చాటేలా ఘనంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రికెట్ పోటీలు ఎంతో ఉత్సాహంగా సాగుతుండగా, మైదానంలో నువ్వా నేనా అన్నట్టుగా జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. యువతతో పాటు గ్రామంలోని వివిధ వర్గాల క్రీడాకారులు పాల్గొంటూ తమ ప్రతిభను చాటుతున్నారు. విజేతగా నిలిచే జట్టుకు ప్రథమ బహుమతిగా రూ.50,000 నగదు, ద్వితీయ స్థానంలో నిలిచే జట్టుకు రూ.25,000 నగదు బహుమతులు అందించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీలు ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగనున్నాయని తెలిపారు. క్రీడల ద్వారా యువతను ప్రోత్సహించడమే కాకుండా గ్రామంలో సౌభ్రాతృత్వం, ఐక్యత పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ మిలిటరీ రాజు విష్ణు పేర్కొన్నారు. గ్రామంలో ఇలాంటి క్రీడా కార్యక్రమాలు జరగడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులను అభినందిస్తున్నారు.



