మద్నూర్ జనవరి 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండల ఎస్సైగా మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినారు. ఇక్కడ గత కొన్ని రోజులుగా ఎస్సైగా పనిచేసిన రాజు బిచ్కుందకు బదిలీపై వెళ్లగా బిచ్కుందలో ఎస్సైగా పనిచేసిన మోహన్ రెడ్డి నీ ఉన్నతాధికారులు మద్నూర్ కు బదిలీ చేశారు . ఎస్సై మోహన్ రెడ్డి మద్నూర్ మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ పేకాట అక్రమ ఇసుక రవాణా జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటామని ఎస్సై సూచించారు ప్రజలు పోలీసులకు సహకరించాలని శాంతి భద్రతల పరిరక్షణ కోసం కలిసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు.


