సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ జనవరి 16
కార్యక్రమంలో భాగంగా రోడ్ షోను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెరుకుపల్లి ఎస్సై రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగితే కుటుంబం తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ద్వారా తమ ప్రాణాలను కాపాడుకోవచ్చని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని, రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ రోడ్ షోలో మొగడంపల్లి ఎమ్మార్వోతో పాటు గ్రామ సర్పంచ్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామ ప్రధాన రహదారుల మీదుగా సాగిన ఈ కార్యక్రమం ప్రజల్లో మంచి స్పందనను పొందింది. రోడ్డు భద్రతే లక్ష్యంగా నిర్వహించిన ఈ రోడ్ షో ద్వారా ప్రమాదాల నివారణకు అందరూ సహకరించాలని నిర్వాహకులు కోరారు.



