Listen to this article

సంక్రాంతి రోజున బయటపడిన భారీ మోసం.

జనం న్యూస్:జనవరి 16(రిపోర్టర్:కొత్తమాసు అజయ్ కుమార్, యర్రగొండపాలెం, మార్కాపురం జిల్లా)


సంక్రాంతి పండుగ వేళ సుమారు వెయ్యి కోట్లకు పైగా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన ఒక భారీ ముఠాను బెంగళూరు హుళిమావు పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేయడమే కాక, 4,500 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.240 కోట్లను ఫ్రీజ్ చేశారు.ముంబైకి చెందిన ప్రేమ్ తనేజా ఈ నెట్‌వర్క్‌కు మాస్టర్‌మైండ్ కాగా, దుబాయ్‌లో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించేవాడు.’Swamiji.com’, ‘Neo System App’ వంటి అప్లికేషన్ల ద్వారా స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసేవారు.అక్షయ నగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మెగా స్కామ్ బయటపడింది.