Listen to this article

జనం న్యూస్ జనవరి 16 ముమ్మిడివరం ప్రతినిధి

కాట్రేనికోనలో కనుమ రోజు మెయిన్ రోడ్ లో గల భవానీ ఎంపోరియం వద్ద కుమారి తాతపూడి ఐశ్వర్యచే ఏర్పాటు చేసిన ఐశ్వర్య ఆర్ట్ గ్యాలరి అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ జాతీయ స్థాయి చిత్ర కారుడు ఆకొండి అంజి ప్రారంభించారు. ఇందులో సుమారు రెండు వందలకు పైగా వివిధ కళాకృతులు చిత్రాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులు మరియు గౌరవ అధ్యక్షుడు తాతపూడి లక్ష్మీ నారాయణ మూర్తి, వ్యవస్థాపకుడు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి మరియు తదితరులు కుమారి ఐశ్వర్యను జ్ఞాపిక మరియు దుశ్శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో తటవర్తి వెంకటరత్నం, తాతపూడి గోపీ, కోట ఉమా మహేశ్వర రావు, వేదుల శ్రీనివాస్, డా.ఆణివిళ్ళ కాశ్యప్, ఆణివిళ్ళ పవన్ కుమార్, శ్రీమతి తాతపూడి మిన్నీ, తాతపూడి మాధుర్య, ధార్మిక ప్రవచకులు బి లక్ష్మీ నారాయణ, స్థానికి నాయకులు గ్రంధి నానాజీ, తదితరులు పాల్గొని చిత్రకారిణి ఐశ్వర్యను అభినందించారు.