జనం న్యూస్ 17 జనవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నెల్లిమర్లలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రాముని సేవలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గేదల తుహిన్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు. ఆయనకు ఆలయ అర్చకులు, కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తుహిన్ కుమార్ కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు న్యాయమూర్తి దంపతులకు ఆశీర్వచనం అందజేశారు.
ఆలయ వృత్తాంతాన్ని వివరించారు.


