Listen to this article

జనం న్యూస్ 17 జనవరి 2026

జోగులాంబ గద్వాల్ జిల్లా: రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజల వాహనదారుల ప్రాణాల రక్షణే ముఖ్య ఉద్దేశ్యం తో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన “అరైవ్- అలైవ్” కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు, ఆదేశాల మేరకు జిల్లాలోని పోలీస్ అధికారులు తమ తమ పరిధిలోని షాపింగ్ మాల్స్, రైతు బజార్లు, ఇతర పబ్లిక్ ప్రదేశాలలో కమ్యూనిటీ ఇట్రాక్షన్ ప్రోగ్రామ్స్ లు నిర్వహించి రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ…అరైవ్- అలైవ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ప్రతి వ్యక్తి సురక్షితంగా తన గమ్యస్థానానికి చేరుకోవడమేనని తెలిపారు. ప్రతి వాహన దారుడు తప్పని సరిగా హెల్మెట్, షీట్ బెల్ట్ తప్పని సరి ధరించాలన్నారు. ఏదయినా ఆక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రెస్పాండెంట్ ఆవశ్యకతను తెలియజేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రజలందరి సహకారంతో ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించేందుకు కృషి చెయ్యాలని అన్నారు.ఇందుకోసం ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు.ట్రాఫిక్ రూల్స్‌ను తప్పక పాటిస్తూ వాహనాలు నడపడం, సేఫ్ అండ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులు అనుసరించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, కార్ ఇతర ఫోర్ వీల్ నడిపే వాహనదారులు సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరి అని స్పష్టం చేశారు.అలాగే ప్రతి వాహనదారుడి వద్ద డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ వంటి వాహన ధ్రువపత్రాలు తప్పనిసరిగా ఉండాలని, ఇవి చట్టపరంగానే కాకుండా ప్రమాద సమయంలో మీకు, మీ కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తాయని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో సంబంధిత పోలీస్ అధికారులు, వాహన దారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.