జనం న్యూస్ జనవరి 17 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామంలో నేడు 17వ తేదీ శనివారం శ్రీ సీతారాముల వారి తీర్థ మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరుగుచున్నది. తెల్లవారు 5 గంటల నుండి సీతారాములు వారిని దర్శనముకు భక్తులు పాల్గొని తమ కోరికలను తీర్చుకున్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మరియు కబడ్డీ పోటీలు డాన్స్ బేబీ డాన్స్ ప్రోగ్రామ్స్. చిటికెలు భజనలతో అలరిస్తున్నారు. కుంచంగి గ్రామ టిడిపి అధ్యక్షులు పోలిన సూర్య జగ్గారావు మరియు గ్రామ సర్పంచ్ పల్లెల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరుపుకుంటున్న ఈ కార్యక్రమమునకు జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆటలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామస్తులు, కబడ్డీ ప్లేయర్స్ క్రికెట్ ప్లేయర్స్ పాల్గొన్నారు


