Listen to this article

రెచ్చిపోతున్న పొందూరు మేనేజర్ శ్రీకాంత్ ఏరియా మేనేజర్ శాంతారావు

జనం న్యూస్ ఫిబ్రవరి 2025:- శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన ఇప్పీలి ఈశ్వరి కుటుంబంలో ఒక్క వ్యక్తి లోన్ తీసుకున్నారు లోన్ అమౌంట్ మొత్తం 3,00000 2019 లో తీసుకున్నారు ప్రతినెల వాయిదా ప్రకారం కడుతూ వస్తుండగా ఐదు సంవత్సరాలు అమౌంట్ వడ్డీ తో మొత్తం 429000 వేలు కట్టడం జరిగింది ఇంకా రెండు సంవత్సరాలకి ప్రిన్సిపల్ అమౌంట్ 150000 వడ్డీ 57000 ఉందని ఫైవ్ స్టార్ మేనేజర్ శ్రీకాంత్, ఏరియా మేనేజర్ శాంతారావు అధికారులు తెలిపారు అయితే ఈశ్వరి కుటుంబానికి చెందిన వ్యక్తి రెండు సంవత్సరాల ముందుగానే లోన్ క్లోజ్ చేస్తామని ప్రిన్సిపాల్ అమౌంట్ అమౌంట్ తో పాటు ఫోర్ క్లోజర్ అమౌంట్ తో చెల్లిస్తామని ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అధికారులకి చెప్పడం జరిగింది ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అధికారులు పొందూరు బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ శ్రీకాకుళం ఏరియా మేనేజర్ శాంతారావు స్పందించి ప్రిన్సిపాల్ అమౌంట్ తో కట్టడం జరగదు అని బెదిరించడం జరిగింది ఏమైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్తో మాట్లాడుకోండి అంటూ బెదిరించారు వడ్డీ తో కట్టాలి లేదంటే ఇంటికి తాళం వేస్తామని బెదిరిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడంలేదని ఆ ఇంటి మహిళలు కన్నీరు పెడుతున్నారు వెంటనే పొందూరు ఎస్ఐ స్పందించి చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు మేనేజర్ లకి కనీస విద్యా అర్హత లేకుండా మేనేజర్లు అవుతున్నారని అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి సంఘటనలు జిల్లాలో చాలా ఉన్నాయని ఎస్పీ ,కలెక్టర్ స్పందించాలని చుట్టుపక్కల గ్రామాల వారు కోరుతున్నారు, ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇలాంటి సంఘటనలుపై దర్యాప్తు చేపిస్తాము అని అన్నారు