Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి బి వీరేశం జనం న్యూస్ జనవరి 17

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 48 క్రికెట్ జట్లు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించగా, కఠిన పోటీల అనంతరం మంద గుబిడి తాండ జట్టు మరియు గుడిపల్లి జట్టు ఫైనల్‌కు అర్హత సాధించాయి. రేపు అనగా ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ఈ రెండు జట్లు పరస్పరం తలపడనున్నాయి. ఈ ఫైనల్ పోటీ ఉదయం 10గంటల నుంచి ప్రారంభం కానుండగా, క్రీడాభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.ఈ క్రికెట్ టోర్నమెంట్‌ను మొగుడంపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో అత్యంత సక్రమంగా నిర్వహించగా, గ్రామ సర్పంచ్ మిలిటరీ రాజు విష్ణు ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. గ్రామ యువతను క్రీడల వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఫైనల్ మ్యాచ్‌లో విజేతగా నిలిచే జట్టుకు రూ.50,000 నగదు బహుమతి, రెండవ స్థానంలో నిలిచే జట్టుకు రూ.25,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలకు పెద్దపీట వేయడం ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రీడాస్ఫూర్తి పెరుగుతాయని అన్నారు. ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మొగుడంపల్లి మండల్‌లో జరుగుతున్న ఈ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులకు ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురానుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.