Listen to this article

జనం న్యూస్ జనవరి 17: నిజామాబాద్ జిల్లా

ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ గ్రామంలో శనివారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, హనుమాన్ చాలీసా అనేది హనుమంతుడిని స్తుతిస్తూ కవి తులసీదాస్ రచించిన ప్రసిద్ధ హిందూ భక్తి స్తోత్రమని తెలిపారు. ఇందులో మొత్తం 40 పద్యాలు ఉండటంతో దీనికి ‘చాలీసా’ అనే పేరు వచ్చిందని వివరించారు.హనుమాన్ చాలీసా అవధి భాషలో రచించబడిందని, రామచరితమానస్ ద్వారా ఇది విస్తృతంగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ఈ పారాయణం భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించడంతో పాటు సమాజంలో ధార్మిక భావాలను బలపరుస్తుందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ధర్మ ప్రసార ప్రముఖ్ ఉట్నూరు రాజశేఖర్‌తో పాటు గుండ విఠల్, భోగ రామస్వామి, ఘనశ్యామ్, పవన్, సాయికిరణ్, ఉమేష్, గంగ ప్రసాద్, సాయన్న, వర్షిత్, సాయితేజ, హర్షసాయి, భరత్, చరణ్, భువన్, నవదీప్ , భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.